![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -250 లో.....ప్రేమకి వచ్చిన కొరియర్ లో ఏమున్నాయని చూడడానికి ప్రేమ గదికి వస్తుంది శ్రీవల్లి. ప్రేమ నిన్ను అత్తయ్య పిలుస్తుందని ప్రేమని బయటకు పంపించి లోపల అంతా వెతుకుతుంది కానీ కొరియర్ ఎక్కడ కన్పించదు.. వేదవతి దగ్గరికి ప్రేమ వెళ్లి పిలిచారటా అని అడుగుతుంది. లేదని వేదవతి చెప్పగానే ప్రేమ తన గదికి తిరిగివెళ్తుంది.
ఆ తర్వాత ప్రేమ తన గదికి రాగానే శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. వెంటనే తనకి దొరికిన కొరియర్ పక్కన పడేస్తుంది. ప్రేమ వెళ్ళిపోయాక ప్రేమ ఆ కొరియర్ చూసి అక్క ఏమైనా ఈ కొరియర్ చూసిందా అని అనుకుంటుంది. ఆ తర్వాత నర్మదని సాగర్ దింపి మిల్ కి వెళ్తాడు. నర్మద బయట ఉండి ఏడుస్తుంటే వేదవతి చూసి ఏమైందని అడుగుతుంది. మా నాన్నకి హార్ట్ ఎటాక్ వచ్చిందని చెప్పగానే అక్కడే ఉన్న రామరాజు విని.. అయ్యో వెళ్లి చూసొద్దాం పదా బుజ్జమ్మ అని వేదవతితో రామరాజు అంటాడు. వద్దు మావయ్య ఇంకా మా నాన్నకి కోపం పోలేదని నర్మద అంటుంది.
కనీసం వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి మాట్లాడమని రామరాజు ఫోన్ ఇవ్వగానే నర్మద వాళ్ళ అమ్మకి వేదవతి ఫోన్ చేసి మాట్లాడుతుంది. మరొకవైపు చందు దగ్గరికి సేట్ వచ్చి డబ్బు ఇవ్వమని గొడవ చేస్తాడు. చందు అది ఆలోచిస్తూ నడుచుకుంటూ వెళ్తుంటే.. ఎదురుగా వ్యాన్ వస్తుంది. వెంటనే ధీరజ్ వచ్చి పక్కకి లాగుతాడు. ఆ తర్వాత సాగర్ కి ఫోన్ చేసి రమ్మంటాడు ధీరజ్. ఏమైంది నీకు ఎందుకిలా ఉన్నావని ఇద్దరు చందుని అడుగుతారు. నాకు ఒక లక్ష కావాలని చందు అనగానే నా వల్ల కాదని సాగర్ అంటాడు. నేను ఏర్పాటు చేస్తానని ధీరజ్ అంటాడు. ఇక డబ్బు కోసం ధీరజ్ ట్రై చేస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |